TT Ads

మచిలీపట్నం:ఉద్యోగ విరమణ వృత్తి కే కాని వ్యక్తికి కాదు అని కృష్ణాజిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎం మహమ్మద్ బాషా పేర్కొన్నారు.

మచిలీపట్నం ఐ అండ్ పి ఆర్ శాఖ ఉద్యోగి రికార్డ్ అసిస్టెంట్ భవాన్ సింగ్ బుధవారం ఉద్యోగ విరమణ సందర్భంగా ఆయనకు స్థానిక జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయ ప్రాంగణంలో జరిగిన పదవీ విరమణ వీడ్కోలు సభకు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఐ అండ్ పి ఆర్ డిడి ఈ భాషా సందర్భంగా మాట్లాడుతూ, గత 37 సంవత్సరాలుగా మచిలీపట్నం సమాచార, పౌర సంబంధాల శాఖ ‌పరిధిలో సింగ్ ‌ ఎనలేని సేవలు చేశారని ప్రశంసించారు . విధి నిర్వహణలో ఎంత ఒత్తిడిలో ఉన్నప్పటికీ సింగ్ ఓర్పుతో కనబడతారన్నారు. ఉద్యోగ విరమణ అనేది ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి సహజమేనని చెప్పారు.

ఈ కార్యక్రమంలో ఏపీ భవన్ ( ఢిల్లీ ) ప్రత్యేక సమాచార విశ్రాంత అధికారి కంచర్ల జయరావు, విశ్రాంత డి పి ఆర్ ఓ గోవింద రాజులు, డిప్యూటీ డైరెక్టర్ ఎస్.శ్రీనివాసరావు లతోపాటు పలువురు సమాచార శాఖకు చెందిన ఉద్యోగులు, పత్రికా ప్రతినిధులు పాల్గొని ప్రసంగించి, ఆయనను సన్మానించారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *