TT Ads

వాలంటీర్ వ్యవస్థకు సన్మానం పేరుతో ప్రభుత్వం రూ.261కోట్లు తగలేసింది.ఉద్యోగులు, పనివాళ్లుకాని వారికోసం జగన్ ప్రభుత్వం ప్రజలసొమ్ముని దుర్వినియోగం చేయడమేంటి వాలంటీర్లను నియమిస్తూ, 4లక్షల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చామని ముఖ్యమంత్రి చెప్పాడు.వారంతా జీతాలు పెంచాలని డిమాండ్ చేయగానే వాలంటీర్లు సేవకులు మాత్రమేనన్నాడు.వైసీపీ జెండా మోసిన వాలంటీర్లనే వజ్రాలు, రత్నాలుగా ముఖ్యమంత్రి సత్కరించాడు.తన పార్టీ కోసం, ఎన్నికల్లో పనిచేయని వారికి రూ.10వేలిచ్చి సరిపెట్టాడు.దేశంలో ఎక్కడా లేనివిధంగా తన పార్టీ పటిష్టత కోసం ప్రభుత్వ సొమ్ముని ముఖ్యమంత్రి వాలంటీర్ల కోసం ఖర్చుచేస్తున్నాడు.వాలంటీర్ వ్యవస్థ నియామకం, వినియోగం, దానికి చేస్తున్నచెల్లింపుల పై చట్టపరంగా పోరాడతాము.వాలంటీర్లకు జీతాలు పెంచడం చట్టపరంగా సాధ్యంకాదనే ఉగాది పురస్కారాల పేరుతో ముఖ్యమంత్రి వారికి లంచాలిచ్చాడు.ప్రభుత్వమే లంచాలిచ్చి మరీ వ్యవస్థల్లోకి, ఒక కృత్రిమ వ్యవస్థను చొప్పించాలని చూస్తోంది.వచ్చే ఎన్నికల్లో వాలంటీర్ వ్యవస్థతో తిరిగి గెలవాలనుకుంటున్న ముఖ్యమంత్రి కలలు, కల్లలుగానే మిగిలిపోతాయి.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *