TT Ads

పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఎం. గిరిజా శంకర్ పిలుపు ఉద్యోగులందరూ దైర్యంగా ముందుకొచ్చి వ్యాక్సిన్ వేయించుకోవాలని, రెండవ దశ కోవిడ్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు మాస్కు ధరించి, తరచూ చేతులు శుభ్రం చేసుకుంటూ, కోవిడ్ ఆరోగ్య సూత్రాలు పాటించాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఎం. గిరిజా శంకర్ అన్నారు.

45 సంవత్సరాలు నిండిన గ్రామీణాభివృద్ధి ఉద్యోగులందరూ ఏప్రిల్ 1, 2021 అంటే గురువారం తాడేపల్లిలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఉద్యోగుల వ్యాక్సినేషన్ ప్రక్రియను కమిషనర్ స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ, వ్యాక్సినేషన్ పట్ల అనుమానాలను తొలగించుకుని రాష్ట్ర వ్యాప్తంగా వున్న వివిధ శాఖల ఉద్యోగులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని పిలుపునిచ్చారు. గ్రామీణాభివృద్ధి శాఖ సిబ్బంది అందరికన్నా ముందుగా వ్యాక్సిన్ వేయించుకుని మిగిలిన ఉద్యోగులకు ఆదర్శంగా నిలిచారని, వ్యాక్సిన్ వేయించుకున్న ఉద్యోగులందరని కమిషనర్ అభినందించారు.

కాగా మొదటిదశ లో గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయంలో పనిచేస్తూ, 45 సంవత్సరాలు పైబడిన ఉద్యోగులు 45 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. రెండవ దశలో అంటే ఏప్రిల్ 6న మరో 36 మంది పంచాయతీ రాజ్ శాఖ ఉద్యోగులు వ్యాక్సిన్ వేయించుకోనున్నారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *