TT Ads

రాచకొండ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగులకు పదవీకాలం పెంచడం తో ఇక ఉద్యోగం రాదని బాధతో ఆత్మహత్య చేసుకున్న సునీల్ నాయక్ కుటుంబ సబ్యులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ, వై ఎస్ షర్మిల పిలుపుమేరకు ఎల్బీనగర్ చౌరస్తాలో కేసీఆర్ దిష్టి బొమ్మని దహనం చేసిన YSRTP తెలంగాణ రాష్ట్ర మహిళ యూత్ వింగ్ సభ్యులు విద్యారెడ్డి మరియు ఇతర నాయకులు.

కేసీఆర్ నిరుద్యోగులకు తీరని అన్యాయం చేస్తున్నాడని ఉద్యమ సమయం లో ఎన్నో హామీలు ఇచ్చి ఇప్పుడు ప్రగతి భవన్ లో గడిల పాలన చేస్తున్నాడని అన్నారు విద్యార్థులు ఆత్మహత్య లు చేసుకుంటే తప్ప కేసీఆర్ బయటకి రాలేదని నిరుద్యోగుల గురించి ఆలోచించలేదని అన్నారు.

కేసీఆర్ దిష్టిబొమ్మని దహనం చేసే సమయం లో పోలీసులు అడ్డుకోవడం తో కొంతమేర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.వెంటనే ఆందోళన కారులనీ అరెస్టు చేసి స్థానిక పోలీసు స్టేషన్ కి తరలించారు

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *