TT Ads

ఖమ్మం : ఉగాది పర్వదినం పురస్కరించుకుని ప్రభాత్ టాకీస్ రోడ్ శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో ఆంజనేయ స్వామి ప్రత్యేక అలంకరణతో ఆలయానికి వచ్చిన భక్తులకు దర్శనమిచ్చారు . అనంతరం దేవాలయం ప్రధాన అర్చకులు గట్టు హరీష్ శర్మ గారు శ్రీ ప్లవ నామ సంవత్సరం ఉగాది పర్వదిన సందర్బంగా స్వామి వారికీ ఉదయం నుండి పంచామృత అభిషేకం , సిందూర పూజ , నాగవల్లి దళర్చన మరియు స్వామి వారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు . కరోనా సూత్రాలను పాటిస్తూ వచ్చినటువంటి భక్తులు స్వామి వారిని దర్శించుకొని హారతి తీసుకున్నట్టు పేర్కొన్నారు . ప్రజలంతా సుఖా సంతోషాలతో , ఆయువు ఆరోగ్యాలతో , అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని ఆశీర్వదించారు .

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *