TT Ads

వెలగపూడి ఈ నెల 8న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగులు, కార్మికులకు వివిధ చట్టాల కింద రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది. ఆ రోజు లోకల్‌ హాలీడే ప్రకటించాల్సిందిగా జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. దుకాణాలు, సంస్థల్లో పని చేసే ఉద్యోగులు, కార్మికులకు ఏపీ షాప్స్‌ అండ్‌ ఎస్టాబ్లి్‌షమెంట్‌ యాక్ట్‌ కింద ఆ రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించింది. ప్రభుత్వోద్యోగులు, అధికారుల్లో ఎవరూ నిర్దేశించిన నియమ నిబంధనలను ఉల్లంఘించరాదని ప్రభుత్వం ఆదేశించింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ ముగియడానికి 48 గంటల ముందు నుంచే ఆయా ప్రాంతాల్లో మద్యం దుకాణాలను మూసి వేయించాల్సిందిగా ఆదేశాలు జారీచేసింది

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *