TT Ads

ప్రమాదకర పట్టణ సంస్కరణలు, ఆస్తివిలువ ఆధారిత ఇంటిపన్ను పాపం బిజెపిదే .బీజేపీ నేతలే ఇంటి పన్ను తగ్గించాలనిరాష్ట్రంలో డిమాండ్ చేయడం సిగ్గు చేటు.కేంద్రం షరతులకు లొంగి రాష్ట్రప్రజలపై 10వేల కోట్ల రూపాయల భారాన్ని మోపిన వైసీపీ ప్రభుత్వం.పన్ను భారాలపై ఈ నెల 16,17 తేదీల్లో రాష్ట్ర వ్యాప్త ఆందోళన- సిహెచ్ బాబూరావు కన్వీనర్, ఆంధ్రప్రదేశ్ పట్టణ పౌర సమాఖ్య(A.P.U.C.F)బాబురావు కామెంట్స్నడు మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలోజరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో బాబూరావు మాట్లాడారు.బిజెపి నేతలు ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారు,రెండు నాల్కల ధోరణితో మాట్లాడు తున్నారు.రాష్ట్ర ప్రభుత్వాలను లొంగ దీసుకుని సంస్కరణల పేరుతో పెత్తనం చేస్తున్నది కేంద్ర ప్రభుత్వమే.ఆస్తివిలువ ఆధారిత ఇంటి పన్ను విధానానికి, ప్రతి పనికి రేటుకట్టి యూజర్ చార్జీలు వసూలు చేసే ప్రమాదకర పద్ధతులకు మూలం మోడీ సర్కార్ విధానాలే..పట్టణాలలో పన్నులు, విద్యుత్ ప్రైవేటీకరణ, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో కార్మిక చట్టాలలో మార్పులు తదితర షరతులను రుద్ది ప్రజలను అధోగతి పాలు చేసింది కేంద్రమే.బిజెపి రాష్ట్ర నాయకులకు ధైర్యముంటే మోడీ వద్దకు వెళ్లి పన్నులు పెంచే షరతులు రద్దుచేయించండి.మడమ తిప్పనని మాట ఇచ్చి అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రజల ప్రయోజనాల్ని పణంగా పెట్టి కేంద్రం విధానాలకు ఎందుకు దాసోహం అంటోంది.ప్రతిపక్షంలో ఉండగా భారాలను వ్యతిరేకించిన
జగన్మోహన్ రెడ్డి నేడు ఎడాపెడా పన్నులు వాయించడం శోచనీయం.కేంద్రం, మోడీ మెప్పు కోసం పట్టణ ప్రజలను పన్నుల ఊబిలోకి దించుతున్నారు, చట్టాలను సవరించారు.ముక్కలు ముక్కలుగా, దశలవారీగా ప్రజల కళ్ళుకప్పి మోసపూరిత మాటలతో మభ్య పరుస్తూ రాష్ట్రప్రభుత్వం పన్నుల మోత మోగిస్తోంది.ఆస్తివిలువ ఆధారిత పన్నుల విధానం వలన ప్రజలపై తక్షణమే 3వేల కోట్ల భారం పడుతుంది.

దశల వారీగా10 వేల కోట్ల రూపాయల భారం తప్పదు.ఇల్లు ఉంటే పన్ను, ఖాళీ స్థలంపై పన్ను, మంచినీరు,భూగర్భ డ్రైనేజీ,చెత్త అన్నింటి పైన రుసుములు చెల్లించాల్సిందే.ఇంతటితోనే సరిపెట్టకుండా ప్లాను లేకపోయినా, అదనపు గది కట్టుకున్నా 25శాతం నుండి 100 శాతం వరకు అదనపు పన్నుకు నిబంధనలు రూపొందించారు.ఇళ్ల పట్టాలు లేని వారందరూ 100శాతం అదనపు పన్ను చెల్లించాలనీ 198జీవోలో పేర్కొన్నారు.అధికారయుత సమాచారం ప్రకారమే ఒక్క విజయవాడ లోనే ప్రజల భవనాలను 70వేల కోట్ల రూపాయలు ఆస్తి విలువగా లెక్కించారు.దీని వలన ప్రస్తుతం ఉన్న 82కోట్ల రూపాయల ఇంటి పన్ను 225 కోట్ల రూపాయలకు పెరుగుతుంది. భవిష్యత్తులో అది 1250కోట్ల రూపాయలకు పెరిగే ప్రమాదం ఉంది.విజయవాడలోనే కాదు రాష్ట్రం లోని అన్ని పట్టణాల్లో నూ ఇదే రీతిలో పన్నులు పెనుభారంగామారనున్నాయి.పన్నుల భారాల రద్దుకు , కేంద్రం షరతులు ఉపసంహరించాలని రాష్ట్రప్రభుత్వం చేసిన మున్సిపల్ చట్ట సవరణ రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 16,17 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఆందోళన, నిరసన కార్యక్రమాలు జయప్రదం
చేయాలి. అందరూ భాగస్వాములు కావాలి.నేడు జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో విజయవాడ నగర పౌర సమాఖ్య నాయకులు డి.కాశీనాథ్ కూడా పాల్గొన్నారు

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *