TT Ads

శ్రీ మహావిష్ణువు ధర్మరక్షణ కోసం ధరించిన దశావతారాల్లో మొట్టమొదటిది మత్స్యావతారం. సృష్టి పరిణామ క్రమంలో మత్స్యావతారాన్ని జలావిర్భావానికి సంకేతంగా చెబుతారు. ప్రతి సంవత్సరం చైత్ర బహుళ పంచమినాడు ‘మత్స్యజయంతి’ జరుపుకొంటారు. సోమకుడు అనే రాక్షసుడు బ్రహ్మ నుంచి నాలుగు వేదాలూ ఎత్తుకుపోయి సముద్రంలో దాక్కున్నాడు. దాంతో బ్రహ్మ సృష్టికార్యానికి ఆటంకం ఏర్పడింది. బ్రహ్మ విష్ణువుతో మొరపెట్టుకున్నాడు. స్వామి మత్స్యరూపం ధరించి సముద్రంలోకి చొచ్చుకుపోయి సోమకాసురుణ్ని సంహరించి, తన నాలుగు చేతులతో నాలుగు వేదాలు తెచ్చి బ్రహ్మకు అందజేశాడు. ఇది మత్స్యావతార గాథ

మన దేశంలో మత్స్యావతారానికి ఒకే ఒక దేవాలయం ఉంది. అది తిరుపతికి 70 కి.మీ. దూరంలో నాగలాపురం అనే గ్రామంలో ఉంది. ఈ ఆలయ అభివృద్ధికి శ్రీకృష్ణదేవరాయలు చాలా సహకరించినట్లు చరిత్ర చెబుతోంది. ఈ గుడిని వేదనారాయణస్వామి ఆలయం అని పిలుస్తారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *