TT Ads

అందరూ చేత్తో బొమ్మలు గీస్తారు.చేతి వేళ్ళతో పెన్సిల్ నో, కుంచెనో పట్టుకొని చిత్రాలు వేస్తారు. కానీ ఈ కేరళ కుట్టి మాత్రం కాళ్ళతో బొమ్మలు వేస్తుంది. కాలి వేళ్ళతో పెన్సిల్,కుంచెపట్టుకొనిచిత్రాలనుచిత్రిస్తుంది.అవునుఆమెకురెండు చేతులూ లేవు మరి..కాళ్ళనే చేతులుగా చేసుకొనిచిత్రకళపట్లతనకున్నమక్కువకుసరికొత్తఅర్థంచెబుతోంది.చిత్రకళా ప్రపంచం తన పేరును తప్పక గుర్తుపెట్టుకునేలా…తనకంటూ చిత్రకళాప్రపంచం తనకంటూ ఓ స్థానాన్ని పదిలం చేసుకుంది.

ఆమెపేరు..స్వప్న అగస్టీన్..(Swapna Augustine)కేరళకు చెందిన ఈ అమ్మాయి కాళ్ళతో ఎన్నో అద్భుత చిత్రాలనువేస్తూ చిత్రకళకు కొత్త రంగులద్దుతోంది. ఈమె” Mouth and Foot painting arts association” లో సభ్యురాలు కూడా.‌ రెండు చేతులు కాళ్ళు లేకున్నా ఎంతోమందికి స్ఫూర్తినిస్తున్న ప్రఖ్యాత వక్త Nick Vujicic ఈమెకు స్ఫూర్తిప్రదాత.

సృష్టిలో ఎన్నో అద్భుతాలున్నాయి. అలాంటి …‌.
అద్భుతాలలో స్వప్న అగస్టీన్ కూడా ఓ అద్భుతం.
పుట్టుకతోనే రెండు చేతులూ లేవు.చిత్రకళ పట్ల
రుచి,అభిరుచీ వున్నాయి.చేతుల్లేవుకదా అని ఆమె
ఊరుకోలేదు.కొండంత ఆత్మవిశ్వాసాన్ని ప్రోది
చేసుకుంది. తన కాళ్ళనే చేతులుగా మార్చుకుంది‌.
చిత్రప్రపంచాన్ని తన కాళ్ళ దగ్గరకే రప్పించుకుంది.
చేతుల్లేని లోపాన్ని ఊహల్లోకి కూడా రానీకుండా
కాళ్ళకు పనిచెప్పింది‌. మనసులోని భావాలను
గీతలుగా గీసి,వాటికి రంగుల పరిమళాల్ని అద్దింది.
చూస్తూ.. చూస్తూ వుండగానే ఆ చిత్రాలకు రెక్కలొ
చ్చి ..చిత్రకళా ప్రపంచంలో అందమైన తూనీగల్లా ..
ఎగరడం ప్రారంభించాయి..ఆమె “స్వప్న ” లోకంలో
ఇప్పుడు ఎన్నో రంగు రంగుల ‘చి(సి)త్రాలు.’….

మనిషిలో అవయవ లోపాలుండటం అతని తప్పుకాదు.ముఖ్యంగా పుట్టుకతో కలిగే అంగవైకల్యంఖచ్చితంగా ఆ సృష్టికర్త తప్పే. లోపం వుంది కదాఅని కుంగిపోకుండా..లోపాన్ని కూడా అవకాశంగా మలుచుకోవాలి. ఇది చెప్పినంత తేలికేం కాదు.కష్టపడాలి. ఇందుకు బోలెడు సానుకూల దృక్పథం అవసరం.స్వప్న అగస్టీన్ లోఈ గుణంకాస్తఎక్కువగానే వుంది.అందుకే ఆమె లోపాన్ని మరిచి, సానుకూల దృక్పథంతో ముందడుగు వేసింది. తనలోని చిత్ర కళాభిరుచిని కాన్వాసుపై పరిచి రంగుల చిత్రాల్ని సృజిస్తోంది. లోకం చూపును తన వైపుకు తిప్పుకునేలా చేసింది.

అమ్మా ! స్వప్న..మీకు.. salute..!!

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *