TT Ads

ఇది ఒక అడ్డగోలు, అరాచక, అప్రజాస్వామిక ప్రభుత్వంతిరుపతి ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లు గుద్దుకోవడానికి వైసీపీ మంత్రులు, మెమ్మల్యేలు గుంటకాడ నక్కల్లా కాచుక్కూచ్చున్నారు.15 వ తారీఖు సాయంత్రం 7 గంటలకు తిరుపతి ఎన్నికల ప్రచారం ముగిసినా రాష్ట్ర క్యాబినెట్ (మంత్రులు) పార్లమెంటు పరిధిలోనే తిష్ట వేశారు.పోలీసులు ప్రతిపక్ష పార్టీ నాయకులను పంపివేసి అధికార పార్టీ మంత్రులను మాత్రం అనుమతించడం అధిరార దుర్వినియోగం కాదా?ఎన్నికల కోడ్ ను అమలు చేయాల్సిన డిజిపి ఏం చేస్తున్నారు?పిల్లి కళ్లమూసుకొని పాలు తాగిన చందంగా డీజీపీ వ్యవహరిస్తున్నారు.వైసీపీ నాయకులకు చట్టాలన్నా, వ్యవస్థలన్నా లెక్కలేదు.తిరుపతిలో చట్టం-నేరం చేయిచేయి కలిపి సాగుతూ దోబూచులాడుతున్నారు.కృష్ణా జిల్లాలోని ఇద్దరు మంత్రులు నెల్లూరులో ఒకరు, తిరుపతి లో ఒకరు అక్రమాలకు పాల్పడేందుకు అక్కడే తిష్ట వేశారు.పోలీసులు కళ్యాణమండపాలను, లాడ్జీలను తనిఖీ చేసి అధికార పార్టీ నాయకులను వెంటనే బయటకు పంపాలి.చంద్రగిరి, పుంగనూరు, పీలేరు. పలమనేరు ల నుండి బస్సులలో జనాన్ని తిరుపతి తరలించి బూత్ క్యాప్చర్ చేయాలని చూస్తున్నారు.అంబులెన్సులలో డబ్బు అక్రమ రవాణా ను అరికట్టాలి.ఎన్నికల సంఘం ఆదేశిస్తున్నా , పోలీస్ రెవెన్యూ వ్యవస్థలు అమలుచేయడం లేదు.వాలంటీర్లు ఉద్యోగులు కారు, వారిని నియమించింది ప్రభుత్వ బాధ్యతలకోసం కాదు. వారంతా వైసీపీ ప్రచారకులు మాత్రమే.అధికారులు ఎన్నికల సంఘం ఆదేశాల కన్నా ప్రభుత్వ ఆదేశాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *