TT Ads

న్యూఢిల్లీ : ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ COVID19 టీకా డ్రైవ్‌ను తక్షణమే అమలు చేయమని మరియు 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ పొందటానికి అనుమతి ఇవ్వమని సూచించారు, అందరికి అందుబాటులో ఉచితంగా వ్యాక్సిన్ లభించేలా చర్యలు తీసుకోవాలి కోరారు.ప్రభుత్వ ఆసుపత్రుల నెట్ వర్క్ తో పాటు సాధ్యమైనంత పెద్ద మొత్తంలో ప్రైవేటు హాస్పటల్స్ ను టీకా పంపిణి లో భాగస్యామ్యం చేయాలని సూచించారు, జిల్లా స్థాయిలో ప్రభుత్వ మరియు ప్రైవేటు ఆద్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి అత్యంత సమర్థవంతంగా టీకా పంపిణి చేపట్టాలని సూచించారు. పబ్లిక్ ప్లేసుల్లో అనుమతించాలి అంటే వ్యాక్సిన్ దృవీకరణ పత్రం తప్పనిసరి చేయాలి,నిర్ణీత సమయాల్లో ఖచ్చితంగా లాక్ డౌన్ పాటించేలా చూడాలని సూచించారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *