TT Ads

విశాఖపట్నం: మహా విశాఖ నగరపాలక సంస్థ ఆస్తి పన్ను వసూళ్లలో జోన్‌-5 మొదటి స్థానంలో నిలిచింది. 89.24శాతం (రూ.43.46కోట్లు) వసూలు చేసి మిగతా జోన్ల కంటే ముందంజలో ఉంది. అత్యల్పంగా భీమిలి జోన్‌లో 79.16 శాతం (రూ.3.88 కోట్లు) వసూలు చేయగలిగారు. 2020-2021 ఆర్థిక సంవత్సరంలో నీటి సరఫరా, ఆస్తి పన్ను, ఖాళీ స్థలాల పన్ను మొత్తంగా ఆదాయం రూ.469.83 కోట్లు (కరెంట్‌, ఎరియర్‌) జీవీఎంసీకి లభించింది. రూ.177.49 కోట్లు బకాయిలున్నాయి. నగరంలో 5,25,637 అసెస్‌మెంట్లు ఉన్నాయి. వాటి ద్వారా రూ.349.14 కోట్లకు గానూ రూ.259.96 కోట్లు వసూలు చేశారు. ఇంకా 89.18 కోట్లు బకాయిలుండిపోయాయి. ఖాళీ స్థలాల పన్ను రూ.35కోట్లకుగానూ రూ.25.04కోట్లు వసూలు చేశారు. ఇంకా రూ.9.95కోట్లు బకాయిలున్నాయి. నీటి ఛార్జీల వసూలులో 2,33,437 వ్యక్తిగత కనెక్షన్ల నుంచి రూ.80.14కోట్లకుగానూ రూ.23.52 కోట్లు మాత్రమే వసూలు చేయగలిగారు. ఇంకా రూ.43.74కోట్లు వసూలు చేయలేకపోయారు. గాజువాక, విలీన ప్రాంతాలలో 17,668 నీటి కనెక్షన్ల నుంచి రూ.9.63 కోట్లకు గానూ రూ.96.95 లక్షలు వసూలైంది. రూ.8.66 కోట్లు బకాయిలుండిపోయాయి. సెమిబల్క్‌ కనెక్షన్లు 6043 నుంచి రూ.15.61 కోట్ల డిమాండ్‌ ఉండగా రూ.10.44 కోట్లు వసూలు చేశారు. బకాయిలు రూ.5.17 కోట్లు ఉన్నాయి. 86 బల్క్‌ కనెక్షన్ల నుంచి రూ.157.80 కోట్లకు రూ.149.89 కోట్లు వసూలైంది. రూ.7.90 కోట్లు బకాయిలున్నాయి. ఆస్తి పన్నులో రూ.99.13 కోట్లు, నీటి ఛార్జీలలో రూ.78.36 కోట్లు కలిసి రూ.177.49 కోట్ల ఆదాయం సమకూర్చుకోవడంలో రెవెన్యూ సిబ్బంది, నీటి సరఫరా ఇంజినీరింగ్‌ అధికారులు వైఫల్యం చెందారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *