TT Ads

ఏపీలోని కర్నూలు మండలం పంచలింగాల సరిహద్దు చెక్‌పోస్టు వద్ద స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో అధికారుల తనిఖీలో భాగంగా గురువారం తెల్లవారుజామున 14.8 కిలోల బంగారం దొరికింది.తెలంగాణ వైపు నుంచి కర్నూలు వస్తున్న ఆర్టీసీ బస్సును ఆపి తనిఖీ చేయగా రాజు అనే ప్రయాణికుడి సంచీలో బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి.

విచారించగా తాను అనంతపురం జిల్లా తాడిపత్రిలోని రాయలసీమ బులియన్‌ కమ్‌ ట్రేడ్‌ ప్రైవేటు లిమిటెడ్‌ అనే నగల దుకాణంలో గుమాస్తాగా పనిచేస్తానని, తన యజమాని రామకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు హైదరాబాదులోని ఓ బంగారు దుకాణం నుంచి తీసుకొస్తున్నట్లు చెప్పారు,ఆధారాలు సరిగా లేకపోవడంతో బంగారాన్ని సీజ్‌ చేసి కర్నూలు అర్బన్‌ పోలీసులకు అప్పగించారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *