TT Ads

ప్రజా సేవలో అతనొక మైలు రాయిసమాజ సేవలో తనకంటూ ఓ ప్రత్యేకత.ఆపద సమయంలో అందరి వాడు.తన కలంతో జాలువారు పదాలు ప్రజల సమస్యల పరిస్కారానికి శ్రీకారం.నిరుపేదలకు అండగా నిలుస్తున్న సునీల్
చెదిరిన గుండెలకు సేవకుడుఆకలి తీరుస్తున్న ఆదర్శ హెల్పింగ్ హాండ్స్

మండ పేట:ఏదైనా ఒక మంచి పని చెయ్యాలంటే మంచి మనసుండాలి. మానవత్వంతో పది మందికి సాయం చెయ్యడం. ఆపదలో ఉన్న వారికి మేమున్నాం అనే భరోసా కల్పించడం . అనేవి ప్రతి మనిషికి అవసరం. ఇవన్నీ అందరికి మధ్యలో వచ్చేవి కావు. తల్లి దండ్రులు నేర్పిన నడవడికే ఆ పిల్లలకు అలవడుతుంది. సునీల్ జాన్ కుమార్ తనకంటూ ఏమి సంపాదించాలని ఆశ ఎప్పుడు తన కళ్ళలో కనిపించదు. పదిమందికి సేవ చెయ్యాలనే తపన ఆయనది. అందుకే ఆపత్కాలంలో ఉన్న వారి దగ్గర అనుకోకుండానే వాలిపోతారు. సమస్య తెలుసుకొని అయ్యో పాపం అనే దానికంటే సమస్యకు పరిస్కారా మార్గం ఏమిటో తెలుసుకొని రిష్కయిన పనికి పూనుకుంటారు. ఇందులో తనకుఇబ్బంది ఉన్న పర్వలేదు కాని తోటి వ్యక్తులను సేవ్ చెయ్యాలనే తపన తన కళ్ళలో కనిపిస్తది. .కరోనా శవం ను పూడ్చికరోనా సమయంలో ఎందరో దూరంగా ఉంటే చనిపోయిన శవాన్ని పూడ్చి తన మానవత్వం చాటుకున్నారు. ఇలా ఎన్నో ఉన్న బయటకు చెప్పుకోకుండా వుంటారు ఆయన అందుకే ఆయన అందరికి ఆదర్శ ప్రయుడు అని చెప్పవచ్చు.మండలంలోని నిరుపేదల ఆకలి తీరుస్తున్న ఆదర్శ హెల్పింగ్ హాండ్స్ వంటి సంస్థలను సమాజంలో ప్రతి ఒక్కరూ ఆదరించాలని విశ్వం వాయిస్ దినపత్రిక వ్యవస్థాపకులు ఖండవిల్లి సునీల్ జాన్ కుమార్ అన్నారుమండపేట విశ్వం వాయిస్ న్యూస్ తన పుట్టిన రోజు వేడుకలను ఆయన మండపేట 7వ వార్డులోని ఆదర్శ హెల్పింగ్ హాండ్స్ సేవా సంస్థలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధుల సమక్షంలో కేక్ కట్ చేసి వేడుకలు జరిపారు. అనంతరం వృద్ధులకు అన్నదాన కార్యక్రమం జరిపించారు. ఈ సందర్భంగా సునీల్ మీడియా తో మాట్లాడుతూ గత 13 ఏళ్లుగా ఎంతో మంది పేదల ఆకలి తీరుస్తున్న ఆదర్శ సంస్థ సేవలు ప్రసంశనీయమని కొనియాడారు. ప్రతి ఒక్కరూ శుభకార్యాలు, జ్ఞాపకార్థ రోజులు వంటి సమయాల్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి పేదలకు అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో విశ్వం వాయిస్ మండపేట పట్టణ రిపోర్టర్ సత్తి వెంకట శేషగిరిరావు ( వెంకీ సత్తి ) , ఆదర్శ సంస్థ వ్యవస్థాపకులు కొల్లి విశ్వనాధం, సంస్థ సభ్యులు పఠాన్ ఇస్మాయిల్ ఖాన్, గనిపే నాగ భూషణం, కొల్లి రవి, తాతపూడి సత్తిబాబు, తాతపూడి రమేష్, మోర్త శ్యామ్ ప్రసాద్, సిరింగుల విజయ్, బుంగ వెంకటేష్, కొల్లి జీవన్ తదితరులు పాల్గొన్నారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *