TT Ads

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మెరుగైన సేవలను అందిస్తూ ముందుకు సాగుతున్న తరుణంలో మాదకద్రవ్యాల మహమ్మారి నుంచి ప్రజలను కాపాడేందుకు కఠినంగా వ్యవహరించాలని అందుకు అనుగుణంగా మారక ద్రవ్యాల వల్ల జరిగే అనర్థాలను ప్రజలకు వివరిస్తూ వారిని చైతన్య పరుస్తూ, మాదకద్రవ్యాలను రాష్ట్రం లో పూర్తి స్థాయిలో నిర్మూలించేందుకు, మాదకద్రవ్యాల విక్రయాలకు పాల్పడుతున్న వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్ జగన్మోమోహన్ రెడ్డి గారు ఎస్‌.ఈ.బీ., అధికారులకు, పోలీస్ అధికారులకు ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్ర స్థాయి మరియు జిల్లా స్థాయిలో మారక ద్రవ్యాల నిరోధానికి టాస్క్ ఫోర్స్ టీంలను వారం రోజుల క్రితం ఏర్పాటు చేయడం జరిగింది.

ఆంధ్ర ప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ. గౌతమ్ సవాంగ్ IPS., పర్యవేక్షణలో ఎస్‌.ఈ.బి., కమిషనర్ శ్రీ వినీత్ బ్రిజ్ లాల్, IPS., నేతృత్వంలో రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయిలో మాదక ద్రవ్యాలను కట్టడి చేసేందుకు, మాదకద్రవ్యాలు సేవించడం ద్వారా జరిగే అనర్థాలను వివరించేందుకు పైలట్ ప్రాజెక్టు కింద ఆపరేషన్ నయా సవేరా పేరుతో నియంత్రణ ప్రక్రియ మరియు కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా లో విస్తృతగా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. గత వారం రోజుల లో మాదకద్రవ్యాల వినియోగం పైన ప్రజలకు కల్పించిన అవగాహన సదస్సులు, సమావేశాలు, కట్టడికి తీసుకున్న చర్యలపైన ఎస్‌.ఈ.బి., కమిషనర్ శ్రీ వినీత్ బ్రిజ్ లాల్, IPS., అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది.

SEB కమీషనర్, డైరెక్టర్, రేంజ్ DIG లు మరియు జిల్లా ఎస్పీల నేతృత్వంలో రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయిలో జాయింట్ టాస్క్ ఫోర్స్ టీంలు మాదక ద్రవ్యాలను కట్టడి చేసేందుకు తీసుకున్న చర్యలను ఈ సమావేశంలో వివరించారు. విజయవాడలోని ఇబ్రహీంపట్నం, గన్నవరం, కృష్ణలంక, సత్యనారాయణ పురం, పడమటతో పాటు గుంటూరు జిల్లా లోని గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, వినుకొండ, నరసరావు పేట, రేపల్లె, తెనాలి ముమ్మరంగా దాడులు నిర్వహించినట్లు వివరించారు.

ఈ జాయింట్ టాస్క్ ఫోర్స్ దాడుల్లో గత వారం రోజుల్లో 25.02.2021 నుండి 31.02.2021 వరకు గుంటూరు అర్బన్ మరియు రూరల్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 22 కేసులు నమోదు చేసి 44 మందిని అరెస్టు చేయడంతో పాటు 59.70కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోగా కృష్ణ జిల్లా లో జరిపిన దాడుల్లో 10 కేసులు నమోదు చేసి 12 మందిని అరెస్టు చేసి 19 కేజీల గంజాయి ని స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా గత నెల 29న గుంటూరు అర్బన్, విజయవాడ లో ఎస్‌.ఈ.బి., అధికారులు దాడులు చేసి 4 గ్రాములు MDMA (methylenedioxy, methamphetamine) స్వాధీనం చేసుకుని 4 గురు ముద్దాయిలను అరెస్ట్ చేయటం జరిగినది. మిగిలిన ముద్దాయిల కోసం గాలింపు జరుగుతుంది.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *