TT Ads

అందుబాటులోకి ఎల్‌ఎల్‌ఆర్‌ సహా 18 రకాల సర్వీసులు..

దిల్లీ: ప్రాంతీయ రవాణా కార్యాలయాల (ఆర్టీవో) అందించే పలు కీలక సేవలను ఇకపై ఆన్‌లైన్‌లోనే పొందవచ్చు! ఆధార్‌ అనుసంధానం ద్వారా 18 రకాల సేవలను ఆన్‌లైన్‌లోనే అందుబాటులోకి తెస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. డ్రైవింగ్‌ లైసెన్సు, రిజిస్ట్రేషన్‌ ధ్రువపత్రాలకు సంబంధించిన సేవల కోసం… ఆర్టీవో కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదని స్పష్టంచేసింది. ఈ మేరకు జాతీయ రహదారులు, రోడ్డు రవాణాశాఖ శుక్రవారం సర్క్యులర్‌ విడుదల చేసింది. ఈ ఆన్‌లైన్‌ సేవలను ఉపయోగించుకునేవారు తమ ఆధార్‌ సంఖ్యను తప్పనిసరిగా వెల్లడించాల్సి ఉంటుంది.

ఆ సేవలు ఇవీ…

లెర్నర్స్‌ లైసెన్సు (ఎల్‌ఎల్‌ఆర్‌), డూప్లికేట్‌ డ్రైవింగ్‌ లైసెన్సు, డ్రైవింగ్‌ లైసెన్సు పునరుద్ధరణ, వాహన రిజిస్ట్రేషన్‌-లైసెన్సులో చిరునామా మార్పు, ఆర్సీ రిజిస్ట్రేషన్‌, అంతర్జాతీయ చోదక అనుమతి, రిజిస్ట్రేషన్‌-డూప్లికేట్‌ రిజిస్ట్రేషన్‌ ధ్రువపత్రాలు, నిరభ్యంతర ధ్రువపత్రం కోసం దరఖాస్తు, వాహన యాజమాన్య బదిలీ, గుర్తింపు పొందిన డ్రైవరు శిక్షణ కేంద్రం- డ్రైవరు శిక్షణ కోసం దరఖాస్తు, దౌత్యాధికారుల వాహనాల రిజిస్ట్రేషన్‌, వాహనాల లీజు-కొనుగోలుకు సంబంధించిన సేవలను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెచ్చారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *