TT Ads

విజయవాడ: ఆక్సిజన్ కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశంతో స్టీల్ ప్లాంట్, నేవీతో అధికారులు చర్చలు జరిపారు. ఏపీ ప్రభుత్వం తరఫున ప్రిన్సిపల్‌ సెక్రటరీ కృష్ణబాబు భేటీ అయ్యారు. అన్ని ఆస్పత్రులు, మెడికల్ కాలేజీల్లో ఆక్సిజన్ ప్లాంట్ల నిర్వహణను తుర్పు నావికాదళం చేపట్టనుంది. ఆక్సిజన్ ప్లాంట్ లీకేజీలు, స్థితిగతులు, జాగ్రత్తలతో నిర్వహణకు తూర్పు నావికాదళం ముందుకొచ్చింది.

అత్యవసరంగా నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. ఎక్కడ అవసరమైతే అక్కడికి విమానాల్లో తరలించేందుకు ఏర్పాట్లు చేయనుంది. ఆక్సిజన్ ప్లాంట్లలోని సాంకేతిక లోపాలను సవరించేందుకు నేవీ సాయపడనుంది. సింగపూర్, థాయ్ లాండ్, మలేషియా నుండి ఏపీకి ఆక్సిజన్ తో కూడిన 25 క్రయోజనిక్ కంటైనర్స్ తరలించేందుకు నేవీ అంగీకారం తెలిపింది. ఐఎన్‌ఎస్‌ కళింగ్ ఆస్పత్రిలో 60 బెడ్లు కోవిడ్‌కి కేటాయించేందుకు అంగీకరించింది.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *