TT Ads

ఉయ్యూరు:రాష్ట్రంలోని ప్రజలందరికి వెంటనే కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు Y.V.B. రాజేంద్ర ప్రసాద్ mlc ఉయ్యూరు లోని తన స్వగృహంలో “నిరసన దీక్ష”చేసినారు.అలాగే కరోనా రోగులకు బెడ్స్, ఆక్సీజన్, మందులు తక్షణమే అందించాలని రాజేంద్ర ప్రసాద్ డిమాండ్ చేసినారు.అలాగే కరోనా రోగులకు బెడ్స్, ఆక్సీజన్, మందులు తక్షణమే అందించాలని రాజేంద్ర ప్రసాద్ డిమాండ్ చేసినారు.బెడ్స్, ఆక్సీజన్, మందులు అందక పేద ప్రజలు రోజు వందలాది మంది చనిపోతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం అసమర్ధత వల్లే ఇటువంటి కష్టాలు ప్రజలకు వచ్చాయి.రాష్ట్ర ప్రభుత్వం రోగులు, మృతుల సంఖ్య విషయంలో వాస్తవాలు దాస్తూ,దొంగ లెక్కలు చెబుతోంది ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అసమర్థత వల్లనే ప్రజలకు ఈ దుస్థితి దాపురించింది.రిస్థితులు ఇలాగే ఉంటే ప్రజలు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద తిరగబడతారు.ప్రజలందరికి వ్యాక్సిన్ వెయ్యడానికి 1600 ల కోట్లు లేవంటున్న జగన్ రెడ్డి గారు కాంట్రాక్టర్లకు వేల కోట్ల రూపాయలు ఎలా దోచి పెడుతున్నారు.రోమ్ నగరం తగల బడుతుంటే ఫిడెల్ వాయించుకుంటూ కూర్చున్న నీరో చక్రవర్తిని జగన్ రెడ్డి గారు మరిపిస్తున్నారు కరోనా వ్యాధితో పాటుగా పనులు, భూక్తి లేక రాష్ట్రంలోని కోట్లాది మంది పేద ప్రజలు అల్లాడి పోతుంటే జగన్ మోహన్ రెడ్డి గారిలో చలనం లేకపోవడం దారుణం.తమిళనాడు ముఖ్య మంత్రి గారు ప్రకటించినట్లుగా వెంటనే రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి 5000 వేల రూపాయలు ఆర్థిక సహాయం జగన్ ప్రభుత్వం అందించాలి – రాజేంద్ర ప్రసాద్.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *