TT Ads

కృష్ణా జిల్లా (నందిగామ):చందర్లపాడు మండలం ముప్పాళ్ళ కంచికచర్ల మండలం పరిటాల అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల ను జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు పరిశీలించారు.గ్రామంలోని ప్రస్తుత పరిస్థితులు, పోలింగ్ కేంద్రం వద్ద ఏర్పాట్లను నందిగామ డిఎస్పి ని అడిగి తెలుసుకున్నారు.

ఎస్పీ మాట్లాడుతూ:ఈనెల 8వ తేదీన జరగబోవు జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికలకు సంబంధించి జిల్లాలో అన్ని భద్రతాఏర్పాట్లు పూర్తి చేశాంపోలీస్,రెవెన్యూ శాఖల సమన్వయంతో అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లు పూర్తి చేశాంజిల్లాలో మొత్తం 1,092 లొకేషన్లు ఉన్నాయి109 అత్యంత సమస్యాత్మక లొకేషన్లు ఉన్నాయి సమస్యాత్మక లొకేషన్లు 181 ఉన్నాయిసమస్యాత్మక,అత్యంత సమస్యాత్మక లొకేషన్లో వద్ద ఎస్ఐ స్థాయి అధికారులను బందోబస్తుగా వేయడం జరుగుతుందిసమస్యాత్మక గ్రామాల్లో పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం ఎన్నికల వేళ గొడవలు, అల్లర్లు సృష్టించే రౌడీ షీటర్ లను ముందుగా గుర్తించి వారిని ముందస్తు బైండోవర్లు చేసాం. అదేవిధంగా వారిపై నిరంతరం షాడోని పార్టీలతో నిఘా ఉంటుందిజిల్లా పోలీసు సిబ్బందితో పాటు, సచివాలయ ఉద్యోగులు, NSS, NCC, మొత్తం 5 వేల మంది సిబ్బందితో బందోబస్తు విధులుప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు మరియు అక్రమ మద్యం నగదు ఇతర వస్తువుల రవాణాను అడ్డుకునేందుకు జిల్లాలో 65 చోట్ల చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహించేందుకు కు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశాంఇప్పటికే జిల్లా పోలీస్ సిబ్బందితో అత్యంత సమస్యాత్మక గ్రామాలను సందర్శనలు , పోలీసు కవాతు నిర్వహించడం జరిగింది

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *