TT Ads

ఏప్రిల్ 08 వైరా : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130 జయంతి వేడుకలు వాడవాడలా తెలంగాణ రాష్ట్ర దళిత హక్కుల పోరాట సమితి డిహెచ్ పిఎస్ ఆద్వార్యంలో ఘనంగా నిర్వహించాలని రాజ్యాంగం కల్పించిన హక్కుల కోసం దళితులంతా ఏకమై ఉద్యమాలకు సన్నద్ధం కావాలని తెలంగాణ రాష్ట్ర దళిత హక్కుల పోరాట సమితి డిహెచ్ పిఎస్ రాష్ట్ర కార్యదర్శి మందా వెంకటేశ్వర్లు, సిపిఐ వైరా మండల కార్యదర్శి యామాల గోపాల్ రావు కోరారు. ఖమ్మం జిల్లా దళిత హక్కుల పోరాట సమితి వైరా మండల స్థాయి‌ సమావేశం డిహెచ్ పిఎస్ మండల నూతన సమితి 12 మందితో గురువారం సిపిఐ వైరా మండల కార్యాలయంలో ఎన్నిక జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా మందా వెంకటేశ్వర్లు హాజరై మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజల్లో కుల వైషమ్యాలు తొలగించాల్సిన భాధ్యత ప్రభుత్వ పాలకులపై ఉందన్నారు.స్వతంత్ర్య దేశంలో కులం, మత వైద్యులు రోజురోజుకు మరింత పెరిగి పోతున్నాయని నేటికి దళితులపై దాడులు, అత్యాచారాలు, పరువు హత్యలు జరుగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.

దేశవ్యాప్తంగా దళితులపై జరుగుతున్న దాడులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాలకులు నోరు మేదపకుండా దాడులను పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. భారత్ కు స్వాతంత్ర్యం సిద్ధించి ఏడు దశాబ్దాలు గడుస్తున్నా దళితుల బ్రతుకుల్లో ఎలాంటి మార్పుకు, అభివృద్ధికి నోచుకోలేదన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాజ్యాంగంలో దళితులకు కల్పించిన హక్కులు అమలు చేయడంలో నేటి ప్రభుత్వ పాలకులు విఫలమైనారని అన్నారు. ఏడు దశాబ్దాలు కాలంలో దళితులు ఇంకా ఎనకబడి ఉన్నారన్నారని సమానత్వం సామాజిక న్యాయం కుల వివక్షత నిర్మూలన ఆర్థికాభివృద్ధి కాగితాలకే పరిమితం చేశారు.

టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిన విధంగా భూమి లేని ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల వ్యవసాయ భూమి ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ పకడ్బందీగా అమలు చేయాలని‌, దళితుల అభ్యున్నతి కోసం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాజ్యాంలో పొందు పరచిన చట్టాలు, రాజ్యాంగ హక్కులు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో కూడా ఎస్సీ, ఎస్టీ లకు రిజర్వేషన్లు అమలు చేయాలని అన్నారు.

ప్రాణాలకు తెగించి స్వరాష్ట్రం కోసం పోరాడిన నాలుగు కోట్ల మంది ప్రజల ఆకాంక్షలకు  భిన్నంగా తెలంగాణాలో కేసీఆర్ పాలన కొనసాగిస్తున్నారని దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానన్న కేసీఆర్ తానే ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోని దళిత ప్రజా ఉద్యమాలపై ఉక్కు పాదం మోపుతున్నారని అన్నారు. దళితులకు మూడెకరాల వ్యవసాయ భూమి పంపిణీ నేటికీ అమలు చేయక పోగా దశాబ్దాలుగా దళితులు సాగుచేసుకుంటున్న భూములు హరిత హారం, ప్రాజెక్టుల పేరుతో లాకుంటూ నేడు దళితులకు బ్రతుకు లేకుండా చేస్తున్నారని.

దళితులు ఎదుర్కొంటున్న సమస్యలు, రాజ్యాంగం కల్పించిన హక్కులు, ప్రభుత్వం ప్రకటించిన హామిల అమలుకై దళితులంతా ఏకమై ఉద్యమాలు చేపట్టాలని బాబా సాహెబ్ అంబేద్కర్ అశయాలను పునిపుచ్చుకొని దళిత హక్కుల పోరాట సమితి డిహెచ్ పిఎస్ వైరా మండల నూతన సమితి అధ్యక్షులు నల్లగట్ల రవిందర్, కార్యదర్శి కోపెల మధు, కోశాధికారి రాయపుడి శ్రీనివాస్, సమితి సభ్యులు కొమ్ము చంటీ,పిడియాల శేషయ్య, పిడియాల లక్ష్మయ్య, అప్పం సుధాకర్, కంచర్ల కృష్ణ, గుడిమళ్ళ రాయప్ప, ఇళ్ళారపు సైదులు, పూర్ణకంటి తిరుపతిరావు గా ఎన్నికైన వీరు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసీ వైరా మండల కార్యదర్శి గారపాటి అశోక్, అప్పం సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *